![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో పన్నెండవ వారం నామినేషన్ ప్రక్రియ వాడి వేడిగా సాగింది. ప్రియాంక కెప్టెన్ కాబట్టి తనని ఎవరు నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అమర్ దీప్ నామినేషన్ ప్రక్రియని మొదలెట్టాడు. తన మొదటి నామినేషన్ యావర్ ని చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే టాస్క్ లో నువ్వు కాళ్ళు కింద పెట్టావని అని అమర్ దీప్ అనగా.. అది తెలియకుండా చేశాను తెలిసి తప్పు చేయనని యావర్ అన్నాడు. ఆ తర్వాత రతికని అమర్ దీప్ నామినేట్ చేశాడు.
అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. అంబటి అర్జున్ మరియు గౌతమ్ కృష్ణ ఇద్దరు కలిసి శివాజీ, ప్రశాంత్, యావర్ లని టార్గెట్ చేశారు. వీరిద్దరు కలిసి కావాలని నామినేట్ చేసినట్టుగా అభిమానులకి స్పష్టంగా తెలిసింది. అసలు నామినేషన్ పాయింట్ లేకుండా చెత్త రీజన్ తో పల్లవి ప్రశాంత్ ని గౌతమ్ నామినేట్ చేశాడు. ఒకప్పుడు నామినేషన్స్ అంటే పల్లవి ప్రశాంత్‌లో అపరిచితుడు దూరిపోయేవాడు. అసలు ఎదురుగా ఉన్నవాళ్లని మాట్లాడనిచ్చేవాడే కాదు. కానీ ఈ వారం నామినేషన్స్‌లో మాత్రం చాలా కూల్‌గా కామెడీ చేస్తూ ఇచ్చిపడేశాడు ప్రశాంత్. పన్నెండవ వారం నామినేషన్ లో గౌతమ్ చేసిన సిల్లీ రీజన్స్ వెనుక అంబటి అర్జున్ ఉన్నాడని అందరికి తెలిసిందే.
యావర్, శివాజీలని అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే .. ఆ రోజు టాస్క్ లో నువ్వు కాలు కింద పెట్టావ్ అలా ఇంకోసారి చేయకూడదని నామినేట్ చేస్తున్నానని యావర్ తో అంబటి అర్జున్ అన్నాడు. ఆ తర్వాత శివాజీని నామినేట్ చేశాడు. " ప్రశాంత్ అరిచాడని మీకు డిస్టబెన్స్ అవుతుందని అన్నారు. అదే మీరు గేమ్ అయిపోయాక ప్రశాంత్ పై గట్టిగా అరిచారు. అప్పటికి యావర్ గేమ్ ఆడుతున్నాడు.
మీకు డిస్టబ్ అయినట్టు అతనికి కూడా డిస్టబ్ అవుతుంది కదా" అని శివాజీతో అంబటి అర్జున్ అన్నాడు. ఇక్కడ సంచాలకులు శోభాశెట్టి, ప్రశాంత్ కానీ వీరిద్దరిని నామినేట్ చేయకుండా శివాజీని నామినేట్ చేయడమేంటని, నామినేషన్ కి ముందు అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఇద్దరు అనుకొని నామినేట్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.
![]() |
![]() |